15 మంది MLA ల ఫై అనర్హత వేటు !
ఇటీవల రాష్ట్ర అసంబ్లీ లో ప్రభుత్వం ఫై పెట్టిన అవిస్వాస తీర్మానం లో, తమ పార్టీలు జారీ చేసిన విప్ దిక్కరించి , స్వప్రయోజనాలకు లొంగి, తమ పార్టీల కు వ్యతిరేకంగా ఓటేసిన వారిలో, 15 మంది MLA లఫై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ రోజు అనర్హత వేటు వేసారు . విప్ ను ధిక్కరించిన తమ MLA ల ఫై ఆ యా పార్టీలు స్పీకర్ కు ఫిర్యాదు చేయగా , సుమారు రెండు నెలలు విచారణ జరిపి MLA ల నుంచి వివరణ తీసుకున్న తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు .
వీరిలో అనర్హులుగా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి - దర్శి , మద్దాల రాజేష్ - చింతలపూడి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి -కాకినాడ, గొట్టిపాటి రవి- అద్దంకి, సుజయ కృష్ణ రంగారావు - బొబ్బిలి , పేర్ని నాని - మచిలీపట్నం, ఆళ్ల నాని - ఏలూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పుంగనూరు, జోగి రమేష్ - పెడన
అనర్హులుగా ప్రకటించిన టిడిపి ఎమ్మెల్యేలు: ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంబళ్లపల్లి, కొడాలి నాని - గుడివాడ
తానేటి వనిత - గోపాలపురం, అమర్ నాథ్ రెడ్డి - పలమనేరు, వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం
సాయిరాజ్ - ఇచ్చాపురం ఉన్నారు . వీరు కాక మరో నలుగురి ఫై సభా పతి నిర్ణయం తీసుకో వలసి ఉంది . వారిలో
MLA లు వేణుగోపాలచారి, రామకోటయ్య, హరీశ్వరరెడ్డి , గంగుల కమలాకర్ లు ఉన్నారు .
Tags: News, Telugu News,
No comments:
Post a Comment