Friday 31 May 2013

Iddarammalilatho telugu movie review


చిత్రం :  ఇద్దరుఅమ్మాయిలతో

రేటింగ్ : 2. 5 / 5 

నటీ నటులు : అల్లు అర్జున్ , అమలాపాల్ , కేధరిన్ తెరిస్సా , బ్రంహానందం , నాజర్, షావర్ అలీ , సుబ్బరాజు , శ్రీనివాస రెడ్డి తదితరులు.
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
కెమెరా :  అమోల్ రాథోడ్ 
ఎడిటింగ్ : ఎస్ . ర్ . శేఖర్ 
ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్ 
రచన - దర్సకత్వం : పూరి జగన్నాథ్ 


అల్లు అర్జున్ , పూరిజనాథ్ కాంబినేషన్ లో తయారైన 'ఇద్దరుఅమ్మాయిలతో' చిత్రం విడుదల విషయం లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు  (31 May 2013) శుక్రవారం విడుదలై భారీ ఓపినింగ్స్ అందుకుంది. 

స్టోరీ : విదేశాలలో క్లాసికల్ సంగీతం నేర్చుకుంటున్న కోమలి ( అమలపాల్ ) రాక్ స్టార్ సంజు (అల్లు అర్జున్ ) ఒకరి నొకరు ప్రేమించుకుంటారు. వీరి ప్రేమను ఓ డైరీ ద్వారా తెలుసుకున్నఆకాంక్ష (కేధరిన్) వారి ప్రేమను గురించి తెలుసుకునే ప్రయతంలో తనను ఆశ్చర్యం గొలిపే విషయాలను తెలుసుకుంటుంది. ఆ తరువాత సంజు ప్రేమలో పడ్డ ఆకాంక్ష అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా .      

పెర్ఫామెన్స్ :
అల్లు అర్జున్ నటన , డాన్స్ ఆకట్టుకుంటాయి. తను డాన్స్ కోసం యెంత కష్ట పడతాడో తెలుస్తుంది.  ఇందులో హీరోయిన్ గా నటించిన అమలపాల్ పోటిపడి నటించినట్లు అనిపిస్తుంది . కేథరిన్ కేవలం గ్లామర్ గరళ్ గా మిగిలింది. 

బండ్ల గణేష్ నిర్మాత గా బాగా డబ్బు కర్చు పెట్టారు. కస్తుమ్స్ , కెమెరా పనితనం బాగున్నయి. కొన్ని సీన్స్ బాగున్నా ,   మంచి కధ లేకపోవటం లోటనిపిస్తుంది . ప్రేమ సన్ని వేశాలు ఎన్ని సినిమాలల్లో చూసినా కొత్తగానే వుంటుంది . కధనం మంచిగున్నా కధ లేకపోతే ప్రేక్షకుల్ని నిరసపరుస్తుంది . ఈ సారి ఎందుకో పూరి సినిమా లో కామిడి పూర్తిగా ఫెయిల్ అయింది . బ్ర్మహానందం కామిడి చాలా రొటీన్ గా ఉంది . పాటలు , బన్ని డాన్స్ బాగున్నా ప్రేక్షకులు యెంత వరకు ఆదరిస్తారో చూడాలి . 


Tags: Iddarammailatho movie review, cinema review  Allu Arjun, Iddarammailatho,   

Thursday 30 May 2013

శ్రుతి హాసన్ : 'బలుపు' చిత్రం లో రెచ్చిపోయిన శ్రుతి ఎక్స్ పోజింగ్.



శ్రుతి హాసన్ : 'బలుపు' చిత్రం లో రెచ్చిపోయిన శ్రుతి ఎక్స్ పోజింగ్.


రవితేజ హీరో గా వస్తున్న 'బలుపు' చిత్రం లో , ఒక పాటలో శ్రుతి తన అందాలతో రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తంది. త్వరలో రానున్న ఈ చిత్రం స్టిల్స్ మంగళవారం రిలీజ్ చేసారు . అందులో శ్రుతి తన అందాలతో 
తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది . ఈ మద్యజరిగిన ఓ మాగ్ జైన్ పోటో షూట్ లో కూడా అమ్మడు 
బాగా రెచ్చి పోయింది . మరో తమిళ చిత్రం లో రతి భంగిమ పోటో లో శ్రుతి ని  చూసిన వారికి మతి పోయింది. అందుకే శ్రుతి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.    

Tags: Sruthi Hassan, Ravi teja Balupu, Balupu Movie           

Wednesday 29 May 2013

దిష్టి బొమ్మలుగా మారిన మన కధానాయికలు!


దిష్టి బొమ్మలుగా మారిన మన కధానాయికలు!


 గోదావరి  జిల్లా రైతులు  తమ పొలాలకు  దిష్టి తగలకుండా , అందాలు ఆరబోస్తున్న మన తెలుగు హీరోయిన్స్ కటౌట్స్  తమ పొలాల్లో పెటేస్తున్నారు . వారి అందాలు చూస్తూ దారిన వెళ్ళే వారి ద్రుష్టి తమ పొలాల ఫై పడటం లేదని సంతోషిస్తున్నారు . ఫైగా తమ పంటలు బాగా పండుతున్నయి అని వారు   
చెపుతున్నారు.  

Wednesday 22 May 2013