Wednesday 19 June 2013

'బూతు చిత్రాల డైరెక్టర్' గా మారుతి పేరు సార్ధక మవుతుందా !

Maruti Director

'బూతు చిత్రాల డైరెక్టర్' గా మారుతి పేరు సార్ధక మవుతుందా ! 

ఈ మధ్య చిన్న చిత్రాలతో సక్సస్ సాధించిన మారుతి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు. ఈయన గారు తీసిన చిత్రాలు గొప్పగా ఉన్నాయి అన్న పేరు కన్నా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో యూత్ ని ఆకర్షిస్తున్నాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. తొలి చిత్రం ఈరోజుల్లో కొద్దిగా ఉన్నా , రెండవ సినిమా బస్ స్టాప్ చిత్రం లో బూతు డైలాగ్ లతో చిత్రం నడిపించాడు. అదిగో అప్పుడే అతనికి బూతు డైరక్టర్ గా విమర్శల పాలయ్యాడు. ముచ్చటగా ప్రేమకధా చిత్రం అని చెప్పి హార్రర్ చిత్రానికి హాస్యం జోడించి ప్రేక్షకులకు కాలక్షేపం పంచి పెట్టాడు. అందులో కూడా తన మార్క్ వదిలి పెట్ట లేదు . ఇప్పుడు తను తీస్తున్న కొత్తచిత్రం 'కొత్త జంట' లో ఏమాత్రం బూతులు ఉంటాయో అని అందరు అనుకుంటూ ఉండగా మారుతి ప్రొడక్షన్ లో ఇదివరకే తయారైన  'రొమాన్స్' అనేచిత్రం బయ్యర్లకు చూపించారు. ఆ సినిమా మొత్తం బూత్ డైలాగ్ లేనంట, ఇంకే ముంది. కాసుల వర్షం ఖాయం అని బయ్యర్లు ఎగబడి భారీ రేట్ కి చిత్రాన్ని కొనేసారు . 

Tags: Telugu Cinema News, Telugu Movie News, Tollywood        

No comments:

Post a Comment